1990ల నేపథ్యంతో ‘రిమ్‌జిమ్’ సినిమా

Rimjim, based on 1990s Andhra Pradesh, is currently in post production. Makers to announce release date soon.

1990ల సంఘటనల ఆధారంగా రూపొందిన ‘రిమ్‌జిమ్’
1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా దర్శకుడు హేమ సుందర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రిమ్‌జిమ్’. ‘అస్లీదమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో స్నేహం, ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

దర్శకుడి మాటల్లో సినిమా విశేషాలు
ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని తెలిపారు. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దామని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని వెల్లడించారు.

నటీనటులు & ప్రత్యేక ఆకర్షణలు
ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో నటించగా, ఆయన పాడిన రెండు పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రధాన పాత్రలో అజయ్ వేద్ నటించగా, హీరోయిన్‌గా వ్రజన కనిపించనున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ నటిస్తున్నారు.

సాంకేతిక బృందం & నిర్మాణ వివరాలు
AV సినిమాస్, సి విజువల్స్ బ్యానర్లపై జి. సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం కొక్కిలగడ్డ ఇఫ్రాయిం, సినిమాటోగ్రఫీ వాసు పెండం, ఎడిటింగ్ పెనుమత్స రోహిత్ నిర్వహిస్తున్నారు. రియలిస్టిక్ టోన్, భావోద్వేగాల మేళవింపుతో రూపొందుతున్న ఈ ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share