ముద్విన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని చరికొండ గ్రామ పంచాయతీ, బోయిన్ గుట్ట తండా సమీపంలో శనివారం జింక మృతి చెందింది. ఫారెస్ట్ రేంజ్ అధికారి మహమ్మద్ హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం, జింక మృతికి కారణం పేలుడు పదార్థం అని పోస్టుమార్టం నిర్ధారించింది.
ముందుగా అటవీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం మండల వైద్యాధికారి డాక్టర్ భాను నాయక్ ఆధ్వర్యంలో జింక కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. డాక్టర్ల ప్రాథమిక నివేదికలో, పేలుడు ప్రభావంతో జింకకు రెండు దవడలు, నాలుక పూర్తిగా చితికిపోయినట్లు వెల్లడించబడింది.
ఫారెస్ట్ రేంజ్ అధికారి స్పష్టమైన వ్యాఖ్యలలో, జింక మృతికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
Post Views: 28









