జానారెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

Telangana CM Revanth Reddy visited former minister K. Janareddy, inquired about his health and wished him a speedy recovery.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మోకాలి శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న జానారెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జానారెడ్డి త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, సీనియర్ నాయకుడిగా ఆయన అనుభవం పార్టీకి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

కుందూరు జానారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక మంత్రి పదవులు నిర్వహిస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగుతూ మార్గదర్శక పాత్ర పోషించారు.

ఇటీవల అనారోగ్య కారణాలతో రాజకీయాలకు కొంత దూరంగా ఉన్న జానారెడ్డి త్వరలోనే పూర్తిగా కోలుకుని యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావాలని కాంగ్రెస్ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. ఆయన మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share