మేడ్చల్‌ మేడిపల్లిలో ఉప్పల్ కోర్టు ప్రారంభం

Uppal Court inaugurated in Medipally, Medchal; cases from 4th, 5th, and 6th Junior Civil Courts will be heard here.

మేడ్చల్‌ జిల్లా మేడిపల్లిలో ఉప్పల్‌ కోర్టు మంగళవారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి కె. లక్ష్మణ్‌ హాజరై, జిల్లా జడ్జి ఎన్‌. శ్రీదేవి, కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిలతో కలిసి కోర్టు కార్యాలయాలను ప్రారంభించారు.

ఈ కోర్టులో ఉప్పల్‌, మేడిపల్లి, నాచారం, పోచారం, ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్లకు సంబంధించిన 4, 5, 6వ జూనియర్‌ సివిల్‌ కోర్టుల పరిధిలోని కేసుల విచారణ జరగనుంది. ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిలుగా శ్రీకాంత్‌, శ్రీదేవి బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రారంభ దశలో మూడు కోర్టులకు సంబంధించిన కేసుల విచారణ జరుగుతుండగా, త్వరలో మరో ఆరు కోర్టులు కూడా ప్రారంభం కానున్నాయి.

స్థానిక న్యాయవాదులు, ఏసీపీ చక్రపాణి, జిల్లా న్యాయమూర్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొని, కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయ సేవల్లో వేగం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share