ప్రభాస్‌పై పాయల్ పోస్ట్ వైరల్

Payal Rajput’s adorable post praising Prabhas goes viral on social media, drawing funny and warm reactions from fans.

టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘RX 100’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన పాయల్ ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్ సంపాదించింది. తొలి చిత్రమే బ్లాక్‌బస్టర్ అవ్వడంతో ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. వెంకీ మామ, జిన్నా, మంగళవారం, రక్షణ వంటి సినిమాల్లో నటించి తన నటనకు మంచి మార్కులే తెచ్చుకుంది.

సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా పాయల్ తరచూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తన ఫోటోలు, షూటింగ్ అప్‌డేట్స్, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో పెద్ద హల్‌చల్ సృష్టించింది.

“ఎవరైనా అంత అమాయకంగా ఎలా ఉండగలరు?” అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. “ఈ వ్యక్తి ఇప్పటికీ సిగ్గుపడతాడు. ఎందుకు అతను అంత ముద్దుగా ఉంటాడు? దేవుడు అతన్ని దీవించుగాక!” అంటూ పాయల్ చేసిన కామెంట్ ఫ్యాన్స్ హృదయాలను దోచుకుంది. ప్రభాస్‌పై ఇంత క్యూట్‌గా కామెంట్ చేయడంతో ఆ పోస్ట్ వేగంగా వైరల్ అయ్యింది.

పాయల్ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర రియాక్షన్‌లు పెడుతున్నారు. కొందరు “పాయల్.. నువ్వు చెప్పిందే నిజం”, “ప్రభాస్ నిజంగానే అమాయకుడు, అందుకే అందరికీ ఇష్టం”, “ఈ పోస్ట్‌తో నువ్వు కూడా మరింత క్యూట్‌గా కనిపిస్తున్నావు” అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద పాయల్ చేసిన ఈ చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో మంచి చర్చకు దారితీస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share