మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఏన్కూర్ ఎస్ఐ సంధ్య ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నందున, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఆపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే, దాన్ని ఎవరూ చెప్పకూడదని హెచ్చరించారు. చిన్న తప్పిదం కూడా వ్యక్తుల వ్యక్తిగత గోప్యత, ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని స్పష్టంగా చెప్పారు.
సాధారణ ప్రజలు, యువత, వృద్ధులు సైబర్ నేరాల బాధితులు కావొచ్చు. కాబట్టి నేరాలపై అవగాహన పెంచడం, అప్రమత్తంగా ఉండడం అత్యంత ముఖ్యమని ఎస్ఐ సంధ్య చెప్పారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీహరి మరియు ఇతర పోలీస్ సిబ్బంది కూడా పాల్గొని ప్రజలను సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు సూచనలు ఇచ్చారు. ప్రజలు పోలీస్ సూచనలను పాటిస్తే సైబర్ నేరాలను తగ్గించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు.
Post Views: 66









