IBOMMA రవి కేసు – SBI వెబ్ సైట్ హ్యాక్!

On Day 2 of IBOMMA Ravi case, SBI technical team investigates how piracy site links appeared on SBI portal.

IBOMMA రవి పైరసీ కేసులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులు SBI టెక్నికల్ టీంను పిలిచారు. ఈ టీం SBI term life insurance పోర్టల్‌కు IBOMMA లింక్ ఎలా కాపీ అయ్యిందో వివరాలు సమర్పించడానికి హాజరయ్యారు.

లింక్ ద్వారా IBOMMA సినిమాలు SBI పోర్టల్‌లోనుండి కూడా వీక్షించవచ్చన్న అంశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు, ఈ లింక్ తొలగించడానికి టెక్నికల్ సపోర్ట్‌ను పరిశీలిస్తున్నారు.

మామూలుగా ఊహించని విధంగా బ్యాంకు వెబ్ సైట్‌లోకి లింక్ జోడించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సందర్భంలో రవి వెనుక ఎవరు ఉంటారో, IBOMMA ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు వంటి ప్రశ్నలు కూడా లేవలేవు.

 అంతేకాక, IBOMMA “వన్” మరియు ఇతర పేర్లతో కొత్త వెబ్ సైట్లు కూడా ఆక్టివ్ అయ్యి పాపులర్ అవుతున్నాయి. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు సాంకేతిక వివరాలను సేకరిస్తూ నెట్‌వర్క్‌ని ట్రేస్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share