తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల కోసం 2026 పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది.
ప్రతి రోజు పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనున్నాయి. విద్యార్థులు అందించిన టైమ్‌టేబుల్ ప్రకారం, అన్ని పేపర్లు సమయానికి సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన పేపర్లు ఇలా ఉంటాయి:
-
మార్చి 3: ఫస్ట్ లాంగ్వేజ్
-
మార్చి 18: సెకండ్ లాంగ్వేజ్
-
మార్చి 20: ఇంగ్లీష్
-
మార్చి 23: మ్యాథ్స్
-
మార్చి 25: ఫిజికల్ సైన్స్
-
మార్చి 28: సోషల్ స్టడీస్
అదనంగా, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-11 (కంప్యూటర్ కోర్స్), ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, ఫెర్సియన్), ఏప్రిల్ 1న ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-11 మరియు ఎస్ఎస్సీ వోకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్షలు నిర్వహించనున్నాయి.
Post Views: 74









