మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం నాగపూర్ గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరై, కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని తెలిపారు.
రైతాంగానికి సాగునీళ్లు, ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం అందిస్తూ కోటి ఎకరాలకు నీళ్లు అందించగా, ఉత్పత్తులు పెరిగి రైతులు జీవనోపాధి పొందారని కొనియాడారు. అలాగే, 1000 గురుకుల స్థాపన ద్వారా SC, ST, BC, మైనార్టీలకు ఉన్నత విద్యావంతులను తయారు చేశారని పేర్కొన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 32వేల కోట్లు ఖర్చు పెట్టి 90% పూర్తి చేసామని, కేవలం 1000 కోట్లు ఖర్చు పెడితే రూ.12లక్షల ఎకరాలకు నీళ్లు అందించగలిగినట్లు చెప్పారు. అయితే, కాంగ్రెస్ పార్టీ పాలమూరు పచ్చబడకూడదని వ్యతిరేకత చూపిందని విమర్శించారు.
సన్నాహక సమావేశంలో నాగం తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, మాజీ ఎంపీపీ సేనాపతి, నాయకులు భీమన్న, సింగిరెడ్డి సురేందర్, శశిధర్, పాపులు, గోపాల్ రావు, కోర్పాల తిరుపతయ్య, రామకృష్ణ, పూర్ణ కంటి కిరణ్, జీ రాములు, అల్తాఫ్, కుర్మతి రెడ్డి పాల్గొన్నారు.









