ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి-సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం పునర్నిర్మాణం కార్యక్రమంలో హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారాణ్య భారతి స్వామి శుక్రవారం ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ, గ్రామ పురోహితులు, ప్రధాన అర్చకులు వేదమంత్రాలతో ఘన స్వాగతం పలికారు.
స్వామి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి, నాలుగు వందల ఏండ్ల పురాతన ఆలయ పరిసరాలను పరిశీలించారు. మూడు సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం ఆలస్యం అయినందుకు ప్రశ్నించారు. ఆలయాన్ని త్వరగా పునర్నిర్మాణం చేయాలని సూచించారు.
స్వామి సూచన ప్రకారం, ఆలయ నిర్మాణ నిధులు భక్తుల సహకారంతో స్వతహాగా సమకూరుతాయని, ధార్మిక మార్గంలో పనులను చేపట్టాలని సూచించారు. గుడి నిర్మాణంలో ఐక్యంతో గ్రామాల సమాఖ్య విధానం, పాత నిర్మాణ రాయిని ఉపయోగించి నూతన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పారు.
గర్భగుడి సహా పాత నిర్మాణాన్ని తొలగించి, ముందుగా నవధాన్యాలు పండించడం, రెండు ఆవు దూడలను పెంచడం వంటి చర్యలతో కొత్త గుడి నిర్మాణాన్ని ప్రారంభించాలని సూచించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.









