ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా క్షేత్ర స్థాయి పర్యటనలు విద్యార్థులకు అనేక విషయాలపై అవగాహన ఏర్పడతాయని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ జి.ఎన్. శ్రీనివాస్ అన్నారు. హన్వాడ మండలం వేపూరు గ్రామపంచాయతీ ఆవరణలో బుధవారం ఎం.వి.ఎస్. డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ 1 & 2 యూనిట్లు ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను నిర్వహించాయి.
ఈ సందర్బంగా వీసీ మాట్లాడుతూ, సాయం పొందిన వారి దృష్టిలో దైవంగా నిలిపేది సేవ మాత్రమేనని, యువత ఇంత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. క్యాంపులో మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ మెడికల్ కళాశాల నుంచి 22 మంది డాక్టర్లు పలు విభాగాల సేవలను అందించారు.
క్యాంపు ద్వారా 500 మందికి పైగా గ్రామస్థులు వైద్య సేవలు పొందారు. పీయూ వైస్ ఛాన్సెలర్ గి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలతో పాటు ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్న ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సేవలు ప్రత్యేకంగా అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాలమూరు విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. ప్రవీణ్, ఎం.వి.ఎస్. కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, వైస్ ప్రిన్సిపల్స్ రవీందర్ రావు, కృష్ణమూర్తి, అధ్యాపక బృందం, ఎన్ఎస్ఎస్ సీనియర్ వాలంటీర్స్ రాఘవ, రాజు, ప్రోగ్రాం ఆఫీసర్లు సుభాషిని, డాక్టర్ వి. స్వరూప్, వేపూర్ ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులు, సర్పంచ్ చెన్నయ్య, ఉప సర్పంచ్ రమేష్, వార్డ్ మెంబర్స్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు.









