టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా దాదాపు నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన సినిమా ‘ఈషా (Eesha)’. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆదిత్ అరుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్, సిరి హనుమంతు స్పెషల్ రోల్స్‌లో కనిపించనున్నారు. శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించిన ఈ సినిమాను హెచ్ వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై మొదటినుంచే ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కథ చాలా బలంగా ఉందని, అసలు ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని పోస్టులు వస్తున్నాయి. బిజిఎం గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని, ముఖ్యంగా హారర్ సన్నివేశాలు సీట్లో కూర్చున్నవాళ్లను భయపెట్టేలా ఉంటాయని చెబుతున్నారు.
ఈ సినిమాకు రన్ టైం కూడా పెద్ద ప్లస్‌గా మారిందని రివ్యూలు చెబుతున్నాయి. క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులకు షాక్ ఇచ్చేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా థ్రిల్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులను ‘ఈషా’ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.









