యాపలపాయతండా సర్పంచ్‌గా కేతావత్ నీలా ప్రమాణం

Ketavath Neela was sworn in as Sarpanch of Yapalapayatanda village under ST women reservation in Chandampet mandal.

ప్రజల మధ్య నిత్యం ఉంటూ ప్రజా శ్రేయస్సే తన లక్ష్యమని పేర్కొంటూ, గతంలో 20 సంవత్సరాల క్రితం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఉమ్మడి చందంపేట మండలం యెల్మలమంద నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా కేతావత్ మకట్ లాల్ పోటీ చేసి గెలుపొందారు. స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సహకారంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, ఐదేళ్లపాటు మండల పాలక వర్గంలో వైస్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చందంపేట మండలం యాపలపాయతండా గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ST మహిళకు రిజర్వ్ కావడంతో, ఆయన భార్య అగు కేతావత్ నీలా ఈ స్థానంలో పోటీ చేశారు. గ్రామ ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆమె అత్యధిక మెజారిటీతో గెలుపొందడం విశేషంగా మారింది. ఈ విజయం తండాలో రాజకీయంగా కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

ఈ నేపథ్యంలో సోమవారం యాపలపాయతండా గ్రామ సర్పంచ్‌గా కేతావత్ నీలా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి అధ్యక్షత వహించగా, జాన్షన్ సెక్రటరీ విక్రమ్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్ నీలా మాట్లాడుతూ, తనకు ఈ అవకాశాన్ని కల్పించిన తండా గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే స్పెషల్ ఆఫీసర్, జాన్షన్ సెక్రటరీ విక్రమ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన కేతావత్ నీలా, మకట్ లాల్ దంపతులను పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, బంధువులు, మిత్రులు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా సర్పంచ్ నీలా పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share