కొత్తగూడెం జాగృతి ఇంచార్జ్‌గా నమ్మి జగదీష్

Kavitha appoints Nammii Jagadeesh as Kothagudem Jagruthi incharge and Samudrala Kranti Kumar as IT Organizing Secretary.

తెలంగాణ జాగృతిలో కొత్త బాధ్యతలు చేపట్టిన నమ్మి జగదీష్, సముద్రాల క్రాంతి కుమార్ గురువారం అధికారికంగా నియమితులయ్యారు. కొత్తగూడెం నియోజకవర్గ జాగృతి ఇంచార్జిగా నమ్మి జగదీష్‌ను, అలాగే జాగృతి ఐటీ విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సముద్రాల క్రాంతి కుమార్‌ను వ్యవస్థాపక అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకాలతో భద్రాద్రి జిల్లా జాగృతి శ్రేణుల్లో ఆనందం నెలకొంది.

కొత్త బాధ్యతలు స్వీకరించిన నమ్మి జగదీష్ మాట్లాడుతూ, కొత్తగూడెం నియోజకవర్గంలో జాగృతి కార్యకలాపాలను మరింత బలపరచడానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజా సమస్యలపై ఎప్పుడూ రాజీ పడకుండా పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. జాగృతి అందించే వేదికను ప్రజా సేవకు వినియోగిస్తానని అన్నారు.

ఐటీ విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితుడైన సముద్రాల క్రాంతి కుమార్ స్పందిస్తూ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జాగృతి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. జాగృతి కార్యకర్తల మధ్య సమన్వయం పెంచి, ఐటీ రంగంలో జాగృతి ప్రభావాన్ని మరింత విస్తరించే దిశగా పనిచేస్తానని తెలిపారు.

ఇద్దరు నాయకులు తమపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి మరియు జాగృతి నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వీరి నియామకాలతో జాగృతి కార్యకలాపాలకు కొత్త ఊపు వస్తుందని జిల్లా నాయకులు అభిప్రాయపడ్డారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share