పెళ్లికాని యువతికి అబార్షన్ చేసిన సంఘటన స్థానిక జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వైద్యాధికారులు ఆ ఆసుపత్రిని గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే, నోటీసులు మరియు కేసు నమోదు మాత్రమే సరిపడతాయా, లేక ఆసుపత్రిపై మరింత చర్యలు తీసుకుంటారా అనే చర్చ జోరుగా సాగుతోంది.
అసలు ఆసుపత్రి యాజమాన్యం అప్రమత్తమైంది. స్థానిక ఓ బడా నేతను ఆశ్రయించి, తనపై ఎలాంటి చర్యలు జరగకుండా చూడాలని యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేత ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల బిజీ షెడ్యూల్‌లో ఉన్నందున, యాజమాన్యానికి “రెండు రోజుల తరువాత చూసుకుంటాను” అని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
అసుపత్రి యాజమాన్యం గైనిక్ డాక్టర్, స్కానింగ్ సెంటర్‌ను కాపాడుతూ, సంబంధిత ఘటనల వివరాలు బయటకు రాకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. షోకాజ్ నోటీసులు వచ్చినప్పటికీ, పరిస్థితిని నియంత్రించేందుకు వారు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కొందరు అంచనాల ప్రకారం, ఆసుపత్రిని రక్షించేందుకు బడా నేతను హ్యాండిచ్చే అవకాశం ఉంది. అయితే, స్థానిక అధికారులపై ఒత్తిడి చేస్తే, ఈ నేత కూడా పరోక్షంగా సంఘటనకు మద్దతుగా నిలిచినట్లే అవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యం, మాజీ కౌన్సిలర్‌తో కలిసి, ఎన్నికల అనంతరం పరిస్థితిని సరిచేయాలని చూస్తున్నారు.









