ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారు. కొందరికి ఇది ఎంటర్టైన్మెంట్ కోసం, మరికొందరికి అవసరానికి, ఇంకొందరికి సోషల్ కనెక్షన్‌లో భాగం. ఇది ఫాలోవర్స్, సమాజంతో కనెక్ట్ అవ్వడం, సందేశాలను షేర్ చేయడం వంటి సామాజిక పరస్పర చర్యల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే, కొన్నిసార్లు వ్యక్తిగత ఫీలింగ్స్ లేదా ముఖ్య సమాచారం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే షేర్ చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో మీ స్టోరీ కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే కనిపించేలా చేయడం 100% సాధ్యమే. దీని కోసం రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి, Close Friends (క్లోజ్ ఫ్రెండ్స్) ఫీచర్ ద్వారా చేయడం, మరొకటి, Direct Message (DM) ద్వారా స్టోరీని నేరుగా షేర్ చేయడం. ఈ రెండింటిలో DM ఉపయోగించడం ఎక్కువ ప్రైవసీని ఇస్తుంది.
Close Friends ఫీచర్ ద్వారా చేయాలంటే, ముందుగా మీరు ఒక వ్యక్తి లేదా కొంతమందిని లిస్ట్‌లో యాడ్ చేయాలి. ప్రొఫైల్ మెనూలో మూడు లైన్స్‌ను క్లిక్ చేసి Close Friends లిస్ట్‌ను తెరవండి. ఇక్కడి అందరిని రిమూవ్ చేసి, మీరు కోరుకున్న ఒక్క వ్యక్తి లేదా కొందరు మాత్రమే యాడ్ చేయండి. తర్వాత స్టోరీ పోస్ట్ చేసేటప్పుడు కింద ఆకుపచ్చగా కనిపించే ‘Close Friends’ బటన్ సిలెక్ట్ చేసి షేర్ చేయండి. ఈ విధంగా స్టోరీ కేవలం సెలెక్టెడ్ వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుంది.
Direct Message ద్వారా స్టోరీ షేర్ చేయడం మరింత సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. స్టోరీ రికార్డు చేసిన తర్వాత → Send To కింద స్క్రోల్ చేసి ‘Share to Chat’ ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు మీ సెలెక్ట్ చేసిన వ్యక్తి DM చాట్‌లో మాత్రమే స్టోరీ 24 గంటల పాటు కనిపిస్తుంది. ఎవరూ ఇతరులు చూడలేరు, నోటిఫికేషన్ కూడా రాదు. కాబట్టి DMలో షేర్ చేయడం Close Friends కంటే ఎక్కువ ప్రైవసీ మరియు సేఫ్ అని చెప్పవచ్చు.









