పాకిస్థాన్‌లో వరుస ఆత్మాహుతి దాడులు

Multiple suicide attacks hit Peshawar, Pakistan targeting Frontier Corps HQ. Security forces retaliate; several militants killed in ongoing clashes.

పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు నిలయం అయిన ప్రాంతం, తాజాగా పేశావర్ నగరంలో ఉద్రిక్తత వాతావరణంలోకి వెళ్లిపోయింది. ఫ్రాంటియర్ కోర్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు వరుసగా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.

రెండు శక్తివంతమైన పేలుళ్లు సంభవించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు చెలరేగాయి. ఉగ్రవాదులు దాడికి తరువాత కాల్పులకు దిగడంతో సెక్యూరిటీ ఫోర్స్ ప్రతిదాడి ప్రారంభించాయి.

ఇప్పటి వరకు ముగ్గురు పాకిస్థాన్ కమాండర్లు మరణించినట్లు సమాచారం. మరో ఇద్దరు ముష్కరులు సెక్యూరిటీ దళాలతో ఘర్షణ కొనసాగిస్తున్నారు. పోలీస్ అధికారులు ఆ ప్రాంతాన్ని ముట్టడించి అదనపు బలగాలను రంగంలోకి పంపారు.

ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. స్థానిక ప్రభుత్వం ఆ ఆత్మాహుతి దాడులపై అప్రమత్తమై దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈ వరుస దాడులకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share