అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులు రాష్ట్రవ్యాప్తంగా విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరై నిధులను అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 3,137 కోట్లు రూపాయలు రైతుల ఖాతాల్లో పంపిణీ చేయబడ్డాయి. రైతులు తమ బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కడప జిల్లా పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు బటన్ నొక్కి ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రతి రైతు ఖాతాకు రాష్ట్రం నుండి రూ.5,000 చొప్పున, కేంద్రం ఇచ్చే 2,000 రూపాయలను కలుపుకుని మొత్తం రూ.7,000 జమయ్యాయి. రైతులు ఈ సహాయాన్ని సంతోషంగా స్వీకరించారు.
చంద్రబాబు నాయుడు ప్రకృతి సేద్యం ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం నెంబర్ వన్ అవుతుందని అన్నారు. తన స్వంత అనుభవాన్ని తెలిపారు. “నేను కూడా ఒక రైతు బిడ్డను, మా తండ్రికి సేద్యంలో సాయం చేసాను” అని తెలిపారు. రైతులను మద్దతుగా నిలబడతానని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో రైతుల సంక్షేమం, ఆర్థిక మద్దతు కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అలా రైతులు తాము పండించిన పంటలకు సకాలంలో సహాయం పొందడం ద్వారా సురక్షితంగా వ్యవసాయం కొనసాగించవచ్చని అధికారులు అన్నారు.









