ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన తేనె అందించేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది. ఖమ్మం రూరల్ మండలంలోని రామన్నపేట సబ్ జైల్‌లో కొత్త స్టాల్‌ను మంగళవారం ప్రారంభించారు.
డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, జైల్లో తయారైన తేనెను ప్రజలకు అందించడం ద్వారా కేవలం తీపి సరఫరా మాత్రమే కాకుండా ముద్దాయిలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుందని తెలిపారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత ముద్దాయిలు ఇక్కడ నేర్చుకున్న వ్యాపారాన్ని బయట కూడా కొనసాగించవచ్చని సూచించారు. ఈ విధంగా వారు స్వయం-ఉద్యోగ అవకాశాలను పొందగలరని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్(వెల్ఫేర్) శ్రీ మురళి బాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, వరంగల్ రేంజ్, శ్రీ ఎం సంపత్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ శ్రీ ఖాలీద్, శ్రీ ఏ శ్రీధర్ మరియు జిల్లా జైలు ఖమ్మం అధికారులు పాల్గొన్నారు.









