హీరోయిన్ అదా శర్మ వైవిధ్యమైన కథలను ఎంచుకొని, డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘హార్ట్ ఎటాక్’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ‘ది కేరళ స్టోరీ’, ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ వంటి సినిమాలతో సంచలనం సృష్టించింది.
అదా శర్మ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఎమోషనల్ కంటెంట్ లేకపోయిన, స్క్రిప్ట్ స్ట్రాంగ్‌గా లేకపోయిన పాత్రల్లో ఆసక్తి లేకుండా, సవాళ్లతో కూడిన పాత్రలనే ఎంచుకుంటానని చెప్పింది. యాక్షన్ సన్నివేశాలు, శారీరక కష్టం అవసరమయ్యే పాత్రలలో ఎక్కువ ఇష్టం ఉంటుందని తెలిపారు.
‘ది కేరళ స్టోరీ’ రిలీజ్ సమయంలో దేశంలో సగం మంది ఆమెను చంపాలని కోరారని, కానీ మిగతా సగం మంది ప్రేమను చూపారని అదా వివరించింది. ఈ మూవీ ఆమె జీవితంలో మరియు కెరీర్‌లో కీలక మలుపు తీసుకువచ్చిందని, విమర్శలు, బెదిరింపులు ఎదురైనప్పటికీ ఫ్యామిలీ చివరికి సంతోషించినట్లు చెప్పింది.
ఆ తర్వాత వచ్చిన ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ టైమ్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురైనట్లు అదా తెలిపారు. తన కెరీర్‌లో విలువైన పాత్రల కోసం ఎప్పుడూ రిస్క్ తీసే సైద్ధాంతిక దృక్పథం ఉంటుందని, ధైర్యమైన కథలతోనే ఆమె ముందుకు సాగుతారని చెప్పారు.









