చిన్నపాటి వర్షం కురిసిన తర్వాత పాఠశాల ప్రాంగణం బురదమయం కావడంతో విద్యార్థులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన మురళి పంతులు యువసేన సభ్యులు సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు.
బుధవారం పెద్ద శంకరంపేట కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో వారు స్వచ్ఛందంగా సొంత ఖర్చుతో పాఠశాల ప్రాంగణాన్ని చదును చేసి నేల గట్టిగా ఉండేలా స్టోన్ చిప్స్ వేసారు.
అదనంగా, ప్రాంగణంలోని పిచ్చిమొక్కలను తొలగించి, విద్యార్థులు జారకుండా సురక్షితంగా క్రీడలు ఆడేలా, ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రంగా మార్చారు.
మురళి పంతులు యువసేన సేవాభావంతో పాఠశాలను కొత్త అందాలతో సంతరించుకోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు మరియు యువసేన సభ్యులను అభినందించారు.
Post Views: 13









