ఎల్లారెడ్డిపేట మండలంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయాలు అత్యంత చల్లగా ఉండటంతో ప్రజలు ఉలెన్ దుప్పట్లు, స్వెటర్లు, టోపీలు ధరించి స్వీయ రక్షణ చేసుకుంటున్నారు. ప్రతిరోజు కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌కి చేరడం వల్ల చిన్నారులు, వృద్ధులు, యువతీ యువకులు అన్ని వయసుల వారు చలి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్‌లో రాజస్థాన్ నుండి వచ్చిన స్టాల్ వద్ద ప్రజలు ఉలెన్ వస్త్రాలను కొనుగోలు చేస్తూ గట్టి రద్దీ ఏర్పడింది. వృద్ధులు, చిన్నారులు తారతమ్యం లేకుండా చలిమంటలు వేసుకుంటూ కూర్చున్నారు. చలి తీవ్రత దృష్ట్యా చాలామంది మార్నింగ్ వాకింగ్‌కు వెళ్ళే మనసు చేసుకోలేరు. ఉదయం 7 గంటల ప్రాంతంలో చలి తక్కువగా ఉండగా, ఆ సమయంలో మాత్రమే కొంతమంది యువతీ యువకులు మార్నింగ్ వాకింగ్ కోసం బయటకు వెళ్తున్నారు.
చలి తీవ్రత కారణంగా మహిళలు ఉదయం 5 గంటల నుండే లేచి ఇంటి పనులు చేయాల్సి ఉంటుంది. అయితే, ఉదయం 7 గంటల వరకు ఇంటి తలుపులు తెరవకుండా ఇంట్లోనే ఉండటం ప్రస్తుత పరిస్థితిలో సాధారణంగా మారింది. ప్రజల విధ్యార్ధి, వృద్ధులు సురక్షితంగా ఉండడానికి చల్లిపరిమితిని దృష్టిలో పెట్టుకుని ఇంట్లో ఉంటున్నారు.
ఆస్తమా, శ్వాసకోపంతో బాధపడుతున్న వారికి వైద్యులు చలికి తగ్గట్టు సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ వాతావరణం సృష్టవుతుంది. ప్రజలు చలి ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఉలెన్ వస్త్రాలు, దుప్పట్లు మరియు చలికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది.









