జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో బీజేపీ నాయకులు యూట్యూబర్ అన్వేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్వేష్ దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో తీవ్ర ఆగ్రహానికి, సామాజిక భావోద్వేగాలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను సహించేది లేదని, మహిళల గౌరవాన్ని, ధార్మిక విశ్వాసాలను కించపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అన్వేష్‌ను వెంటనే భారత్‌కు తీసుకువచ్చి అరెస్టు చేయాలని, అతని ‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానల్‌ను తక్షణమే బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులు కోరారు. ఇలాంటి కంటెంట్‌పై కఠిన నియంత్రణలు అవసరమని వారు స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు పన్నాటి మల్లేశం, పొనగంటి గౌతమ్ రాజు, కడువ మనోజ్, రాఘవేంద్ర, విష్ణువర్ధన్, సృజన్, గుండోజు చందు, రాజశేఖర్, గంగాధర్, భగవాన్, సాగర్, సుదర్శన్, భోగ రాజు తదితరులు పాల్గొన్నారు.









